నవరసములదీ నళినాక్షి - అన్నమయ్య సంకీర్తనలు |
నవరసములదీ నళినాక్షి (రాగం: ) (తాళం : )
నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీని ||
శృంగార రసము చెలియ మొకంబున | సంగతి వీరరసము గోళ్ళ |
రంగగు కరుణరసము పెదవులను | అంగపు గుచముల నద్భుత రసము ||
చెలి హాస్యరసము చెలవుల నిండీ | పలుచని నడుమున భయరసము |
కలికి వాడుగన్నుల భీభత్సము | అల బొమ జంకెనల
నదె రౌద్రంబు ||
రతి మరపుల శాంతరసంబదె | అతి మోహము పదియవరసము |
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి సతమై యీపెకు సంతోస రసము ||
Watch in Youtube: https://youtu.be/D18Tqw5Ebkc
#Annamayya_Keerthanalu #Navarasamuladhee_Nalinakshi
No comments:
Post a Comment