19 July 2022

ఏ గానమో ఇది ఏ రాగమో | అంతర్యామి .. | Annamyya Song | Special Song | SVBCTTD

 

తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన

అంతర్యామీ అలసితి సొలసితి
యింతట నీ శరణిదె చొచ్చితిని


కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు
నేరుపులఁ బోనీవు నీవు వద్దనక


జనుల సంగములఁ జక్కరోగములు


నిను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదిది నీవిటు సంతపరచక


మదిలో చింతలు మయిలలు మణుఁగులు
వదలవు నీవవి వద్దనక
యెదుటనేఁ శ్రీవేంకటేశ్వర నీవదె
అదనఁ గాచితివి అట్టిట్టనక
సంకీర్తన: అంతర్యామి..
రచన: అన్నమాచార్య
స్వరకల్పన: శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్
రాగం : శివరంజని

Watch in Youtue: https://youtu.be/gF9ApnF47ic

#Annamayya_Keerthanalu
#Antaryami #Yeganamo_Idhi_Yeragamo

No comments: