ఒంటిమిట్ట 15 ఏప్రిల్ 2022:
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు.
మొదటి ఘాట్ రోడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన మహాసంప్రోక్షణ
తిరుమల, 2022 ఏప్రిల్ 15: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ముగిసింది.
ఆలయంలో ఐదు రోజుల పాటు అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి.
ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు భగవత్ ప్రార్ధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణనయం, ప్రధాన కళాశాల వాహన, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు మహా పూర్ణాహూతి, ఉదయం 9.30 గంటలకు విమాన గోపుర శిఖర ఆవాహన, మూలస్థాన వాహనం నిర్వహించారు. మధ్యాహ్నం 12.10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ శ్రీ వైవి. సుబ్బారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీ బావ నారాయణాచార్యులు, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.

No comments:
Post a Comment