15 April 2022

వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవర్ల శోభాయాత్ర


ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 15: 

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్ర‌వారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది.

ఎదుర్కోలు ఉత్సవం :

కల్యాణవేదిక వద్ద సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.

శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.










 

No comments: